Ram gopal varma s movie titled reddy garu poyaru

Varma Movie Titled Reddy Garu Poyaru.GIF

Posted: 02/25/2012 03:22 PM IST
Ram gopal varma s movie titled reddy garu poyaru

Reddy-garu-poyaru

గత కొన్ని రోజులు గా సైలెంట్ గా ఉన్న వివాదాస్పద వ్యాఖ్యల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇవాళ (శనివారం) మరో బాండ్ పేల్చారు. గత కొన్ని రోజుల నుండి ప్రెస్ ముందుకు రాకుండా ట్విట్టర్ ద్వారా కామెంట్ చేస్తున్న వర్మ నేడు మీడియా ముందుకు వచ్చి మరో సంచలనాత్మక ప్రాజెక్టు పేరు ప్రకటించారు.

వర్మ గత కొన్ని రోజుల నుండి ఫ్యాక్షనిస్టుల మీద, మర్డర్ ల మీద సినిమాలు తీస్తూ నిత్యం వార్తల్లో ఉన్న సంగతి తెలిసిందే. రక్త చరిత్ర తరువాత తెలుగు లో సినిమా వాళ్ళ పై సినిమా తీసినా అది అంత సక్సెస్ కాలేదు. తాజాగా ఇప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని బేస్ చేసుకుని సినిమా రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మహానేతగా పిలవబడుతున్న వైయస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తరువాత రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను, సీఎం కుర్చీ కోసం పాకులాడుతున్న వారి వైనాన్ని కూడా వర్మ ఈ సినిమాలో చూపించే విధంగా ఈ సినిమా తీయబోతున్నట్లు మీడియా వర్గాల సమాచారం.

అయితే ఈ సినిమా పై ప్రెస్ మీట్ పెట్టిన వర్మ మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత జరిగిన పరిణామాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన స్ర్కిప్టు వర్క్ ని రూపొందించే పనిలో వర్మ బిజీగా ఉన్నాడట. ఈ సినిమా షూటింగ్ వచ్చే సంవత్సరం ప్రారంభించబోతున్నామని తెలిపాడు. అంతే కాకుండా తనకు రాజకీయాలంటే ఇష్టం లేదని, రాజకీయ నాయకుల మనస్తత్వం తెలుసునన్నారు. ఈ సినిమాని శ్రేయ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని కిరణ్ కుమార్ కోనేరు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

మీడియా వర్గాల సమాచారం ప్రకారం వర్మ ఒక్క రాజశేఖర్ రెడ్డి గురించే కాకుండా మన రాష్ట్ర నాయకుల చరిత్ర గురించి కూడా చెప్పబోతున్నాడని అంటున్నారు. మరి ఈ సినిమా రక్తచరిత్ర లాగా కూల్ గా ఉంటుందో లేక రాజకీయ నాయకుల బండారం బయట పెట్టే విధంగా ఉంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sunil new movie sita weds ramudu
Vidya balan obsessed lover arrested  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles